Phyramid of Energy in Telugu – శక్తి పిరమిడ్

ఈ  రోజు మన ఆర్టికల్ లో  PHYRAMID OF ENERGY గురించి తెలుసుకుందాం.

జీవులలో ఎదుగుదలకు మరియు శరీర భాగాలు నిర్మాణానికి , క్షిణించిన భాగాల పునర్నిర్మాణానికి అవసరం అయ్యే పదార్దాలు మరియు శక్తి కి ఆహరం ముఖ్యమైన వనరుగా ఉంటుంది .

స్వభావ రీత్యా ఆహరం ఒక రసాయన శక్తి . ఇది నిలువ చేయబడిన స్థితి శక్తి రూపంలో ఉంటుంది .

 నిరంతరం పదార్దాలను గ్రహించడానికి , సేంద్రియ పదార్దాల ఉత్పత్తికి మరియు సేంద్రియ పదార్దాల నుండి నీరింద్రియ పదార్దాల మార్పిడికి , వాటి విడుదలకు జీవులలో వివిధ యంత్రాగాలు MECHANISMS ఉన్నాయి.

 మొక్కలు ఖనిజాలను భూమి నుండి గ్రహిస్తాయి . ఇవి నీళ్లతో పాటు వేళ్ళ ద్వారా మొక్కలోనికి శోషించబడతాయి .

జీవుల మనుగడకు కిరణజన్య సంయోగ క్రియ చాల ముఖ్యమైన  విధానం .

 సూర్యకాంతి , కార్బన్ డై ఆక్సిడ్ మరియు నీరు నిర్జీవ అంశాలు అయినప్పటికీ ఇవి జీవులకు చాల అవసరం . 

ఉత్పత్తిధారులైన ఆకుపచ్చని మొక్కలు ఈ  పదార్దాలను శక్తి రూపంలోకి అంటే ఆహరం గా మర్చి ,జీవ ప్రపంచానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంటాయి .

 ఉత్పత్తి దారుల నుండి వివిధ వినియోగదారులకు ఆహరం మరియు శక్తి బదిలీని అర్ధం చేసుకోవడానికి ఆహారపు గొలుసులు ,ఆహార జలకాలు ఉపయోగపడతాయి .

మొక్కలు లేదా జంతువులు లేదా రెండింటి నుండి ఆహారాన్ని గ్రహించడం వలన జంతువు అవసరమైన ఖనిజాలను పొందుతాయి . 

ఈ ఖనిజాలు నిరంతరం నేల నుండి తొలగించబడతాయి . అలాగే గ్రహింపబడుతూ మొక్కలలో భాగమౌతాయి . 

ఆ తర్వాత మొక్కలు ఆహారం గా గ్రహించే జంతువుల శరీరంలో భాగమౌతాయి . 

మీరు తినే ఆహారం లోని వివిధ పదర్దాలను ఎంచుకోండి . ఇవి లభించే వనరులను గుర్తించండి.

ఉదాహరణకు పెరుగు లభించే విధానాన్ని చూద్దాం .

పెరుగును పాల నుండి తాయారు చేస్తారు . అలాగే పాలు ఆవు నుండి లభిస్తాయి . అని మన అందరికి తెలిసిందే . ఆవు తన ఆహారం గా గడ్డిని తీసుకుంటుంది . గడ్డి మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి . 

ఆహారం ఏ రకమైనదైనా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలే కదా . 

జీవి ఆహారం తీసుకొనగానే , దాని లోని శక్తి శరీరంలో వివిధ పంథాలను అనుసరిస్తుంది . 

గ్రహించిన ఆహారం అంత అరుగుదల కాదు . 

జంతు సంబంధ ఆహారం లోని వెంట్రుకలు , ఈకలు ,కీటకాల బాహ్య అస్థిపంజరాలు , మృదులాస్థి మరియు ఎముకలు , వృక్ష సంబంధ ఆహారంలోని సెల్యులోజ్ మరియు లిగ్నిన్లను చాల జంతువులు అరుగుదల చేసుకోలేవు . 

ఎటువంటి జీర్ణం కానీ పదర్దా భాగాలు విసర్జిపబడడం  ద్వారాగాని వాంతిరూపంలో గాని శరీరం నుండి బయటకు పంపబడతాయి . 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

Scroll to Top