Blood Pressure in Telugu – రక్త పీడనం

ఈ రోజు మన ఆర్టికల్ లో రక్త పీడనం గురించి తెలుసుకుందాం . 

రక్త పీడనం అనగా బీపీ అని అర్ధం . 

రక్త వర్గీకరణ మొదలైన అంశాల గురించి జంతుకణజాలం అనే చదివారు కదా .ఇప్పుడు మనం రక్తం గురించి మరికొన్ని విషయాలు అధ్యయనం చేద్దాం . 

రక్తాన్ని వలవంటి రక్తనాళాల ద్వారా ప్రవహిపజేయాలంటే చాల ఎక్కువ ఒత్తిడి కావాలి . 

గుండెలోని జఠరికలు సంకోచించి ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనులలోనికి పంపుతాయి . 

జఠరికలు పీడనాన్ని కోల్పోయి మామూలు స్థితికి చేరుతూ, తర్వాత సంకోచానికి సిద్ధం అవుతాయి . 

డాక్టర్లు స్పిగ్మోమానోమీటర్ అనే పరికరం తో బీపీ ని కొలుస్తారు . 

రక్త పీడనం మన శరీరం లో వివిధ శరీర భాగాల్లో వేరు వేరుగా ఉంటుంది . 

కాబట్టి ఎప్పుడు శరీరం లో నియమితమైన ప్రదేశంలో మాత్రమే రక్త పీడనాన్ని కొలిస్తే వేరు వేరు సమయం లో పీడనాన్నిసరిపోల్చడానికి అవసరం ఉంటుంది . 

అందువలన డాక్టర్లు మన దందా చేయి మోచేయి పై భాగం లో పట్టుకుని చూస్తారు . 

ఉండే ధమనీ పీడనాన్ని మాత్రమే కొలుస్తారు . 

రక్త పీడనానికి  సంబంధిచి డాక్టర్లు రెండు రీడింగులు  నోట్ చేస్తారు . 

జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోనికి పంపినప్పుడు ఫస్ట్ రీడింగ్ తీస్తారు . 

ఇది ఆరోగ్యవంతులైన అమ్మాయిలు , అబ్బాయిలలో 120మి . మి . పాదరస పీడనంగా ఉంటుంది . 

దీనిని సిస్టోలిక్ పీడనం SYSTOLE అని అంటారు . జఠరికలు మామూలు స్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయం లో సెకండ్ రీడింగ్ తీస్తారు . 

ఇది 80మి. మి పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది . దీనినే డయాస్టోలిక్ పీడనం DIASTOLE అని అంటారు . 

రక్త పీడనం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది . విశ్రాంతి ,నడవడం ,పరిగెత్తడం అటువంటి పనులలో రక్త పీడనం వేరువేరు పని చేస్తుంది . 

విశ్రాంతి సమయం లో సాధారణ రక్త పీడనం 120 80 కంటే ఎక్కువ రక్త పీడనం ఉండునట్లైతే ఆ వ్యక్తికీ అధిక రక్త పోటు  HYPERTENSION ఉన్నట్లుగా భావిస్తారు . 

Some Questions and Answers on Blood Pressure

Q: రక్త పీడనాన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటారు ?

Ans: రక్త పీడనాన్ని ఇంగ్లీషులో బ్లడ్ ప్రెషర్ అని అంటారు 

Q: రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని ఎం అంటారు ?

Ans: రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని స్పిగ్మోమానోమీటర్ అని అంటారు . 

Q: సిస్టోలిక్ పీడనం అంటే ఏమిటి ?

Ans: ఆరోగ్యవంతులైన యువతీ , యువకులలో 120 మి . మి . పాదరస పీడనం గా ఉంటుంది . ధీనిని సిస్టోలిక్ పీడనం అని అంటారు . 

Q: డయాస్టోలిక్ పీడనం అంటే ఏమిటి ?

Ans: ఇది 80మి . మి . పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది . దీనినే డయాస్టోలిక్ పీడనం అని అంటారు . 

Q: ఒక వ్యక్తికి అధిక రక్త పోటు  ఉన్నట్లు ఎప్పుడు భావిస్తారు? 

Ans: విశ్రాంతి సమయంలో సాధారణ రక్త పీడనం 120 /80 కంటే ఎక్కువ రక్త పీడనం బీపీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అధిక రక్త పోటు  HYPERTENSION ఉన్నట్లుగా భావిస్తారు .  

Scroll to Top