ఈ రోజు మన ఆర్టికల్ లో కిరణ జన్య సంయోగ క్రియ యాంత్రికం గురించి తెలుసుకుందాం.
కిరణ జన్య సంయోగ క్రియలో ప్రధానం గా రెండు దశల్లో జరుగుతుంది .
వాటి గురించి మనం ippudu తెలుసుకుందాం .
కాంతి చర్య light dependent reaction
నిశ్కాంతి చర్య light independent reaction
ముందుగా కాంతి చర్య గురించి తెలుసుకుందాం. ఈ చర్యలో కాంతి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇందులో కాంతితో ప్రేరేపించబడిన అనేక రసాయనిక చర్యలు ఒకదాని వెంట ఒకటి చాల త్వరగా జరుగుతుంది.
అందువలన ఈ దశను కాంతి రసాయన దశ photochemical phase అని అంటారు.
కాంతి చర్య క్లోరోప్లాస్టలోని గ్రానా థైలకాయిడ్లలో జరుగుతుంది . కాంతి చర్య వివిధ సోపానాలలో జరుగుతూ ఉంటుంది.
మొదటి సోపానం క్లోరోఫిల్ ను కాంతి శక్తి కి బహిర్గతం చేసినప్పుడు ఫోటాన్లనుతీసుకొని క్రియ వంతం అవుతుంది.
కాంతి శక్తి ఫోటాన్ రూపం లో ప్రవహిస్తుంది .
రెండవ సోపానం నీటి అణువు హైడ్రోజన్ H+, హైడ్రాక్సిల్ OH- అయాన్లుగా విడదీయడానికి ఈ కాంతి శక్తి ఉపయోగించబడుతుంది.
H2O → H+ + OH- ఈ చర్యనే నీటి కాంతి విశ్లేషణ PHOTOLYSIS OF WATER అని కూడా అంటారు .
ఫోటో అంటే కాంతి అని లైసిస్ అంటే విచ్ఛిన్నం చెయ్యడమని అర్ధం.
అంటే కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం కావడం అన్నమాట.
దీనిని రాబర్ట్ హీల్ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. దాని వల్లనే ఈ చర్యను హిల్ చర్య అని కూడా అని అంటారు.
మూడవ సోపానం అత్యంత చర్య శీలమైన నీటి అయాన్ లు రెండు మార్గాలలో చాల త్వరగా మార్పు చెందుతాయి.
H+, OH- అయాన్లు వివిధ దశలలో ఎలా జరుగుతాయో చూద్దాము .
OH అయాన్లు ఒక దాని వెంట ఒకటి గా జరిగే అనేక చర్యల పరంపర ద్వారా నీరు H2O మరియు ఆక్సిజన్ O2 ఉత్పత్తి చేస్తుంది.
నీరు మొక్క లోపల ఉపయోగించబడుతుంది కానీ ఆక్సిజన్ మాత్రం గాలిలోకి విడుదల అవుతుంది .
H+ అయాన్ నిశ్కాంతి చర్యలో క్రమానుగత చర్యల పరంపరణకు లోనవుతుంది . కాంతి చర్యలో అడినోసిన్ ట్రై ఫాస్ఫెట్ ATP మరియు చైతన్యం చెందిన నికోటినమైడ్ అడినోసిన్ డై న్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫెట్ NADPH లు అంత్య పదార్దాలుగా ఏర్పడతాయి .
దీనిని గ్రాహ్యక శక్తి ASSIMILATORY ENERGY అని కూడా అంటారు .
ఇప్పుడు నిశ్కాంతి చర్య గురించి తెలుసుకుందాం
ఈ దశలోని చర్యలకు కాంతి శక్తి అవసరం ఉండదు.
అంతే కాకుండా కాంతి చర్యలతో పాటు జరుగుతుంది.
రెండు చర్యల మధ్య వ్యవధి సెకన్ల లలో వెయ్యోవంతు కంటే తక్కువగా ఉంటుంది.
నిశ్కాంతి అంటే చీకటిలో లేదా రాత్రి వేళల్లో జరుగుతుందని అర్ధం కాదు.
ఈ చర్య కాంతి పై ఆధారపడదని అర్ధం తెలుసుకోవాలి .
కాంతి విశ్లేషణలో ఉత్పత్తి అయిన H + అయాన్ ను NADP అనే ప్రత్యేక అణువు తీసుకొని NADPH గా మారుతుంది.
నిశ్కాంతి చర్యలలో NADPH యొక్క H +అయాన్ C O 2 తో పాటు కలిసి ATP శక్తిని ఉపయోగించుకొని గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ సంశ్లేషణ అనేక మధ్యస్థ పదార్ధాలను ముఖ్యంగా రిభ్యులోజ్ అనే బై ఫాస్ఫెట్ ను ఎంజైములను వినియోగించుకుంటూ అనేక సోపానాలలో జరుగుతుంది.
ఈ చర్యలలో చివరిగా గ్లూకోజ్ పిండిపదార్ధం గా అవుతుంది.
మొక్కలు వివిధ రకాల పరిస్థితులలో సైతం తమ జీవ క్రియలను చేయగలుగుతాయి.
అతి ఎక్కువ కాంతి , వేడిగా , పొడిగా ఉండే వాతావరణంలోను తడి ,తేమతో నిండి తక్కువ కాంతి కలిగిన వాతావరణంలోని మొక్కలు తమ విధులను జరుపుకోగలుగుతాయి.
కాంతి మరియు ఇతర కారకాల ఆవశ్యకత మొక్క మొక్కకు విడివిడిగా ఉంటాయి.
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.