Cardiac Cycle in Telugu – హార్దిక వలయం

ఈ  రోజు మన ఆర్టికల్ లో హార్దిక వలయం CARDIAC CYCLE గురించి తెలుసుకుందాం.

హార్దిక వలయాన్ని ఇంగ్లీష్ లో CARDIAC CYCLE అని అంటారు.

మానవుని గుండె పిండ అభివృద్ధి దశలో 21 వ రోజు నుండి  జరుగుతుంది. 

మానవుడు చనిపోయేంత వరకు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. 

గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనం కూడా చనిపోతాం.

కర్ణికలు , జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత మామూలు స్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన లేదా హార్దిక వలయం అని అంటారు. 

ఇప్పుడు దీనిలోని దశలను చూద్దాం.

గుండెలోని నాలుగు గదులు ఖాళీగా విశ్రాంతి స్థితిలో ఉన్నాయనుకొనే ఊహతో హార్దిక వలయం  ప్రక్రియను పరిశీలిద్దాం.

పూర్వ పర మహాసిరల నుండి రక్తం కుడి కర్ణికలోనికి ,

పుపుస సిరాలా నుండి ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవహిస్తుంది . 

ఎప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి . 

కర్ణికల సంకోచం వలన రక్తం కర్ణిక జఠరికలు మధ్యలో ఉన్న కావాటాలను తీసుకొని జఠరిక లోనికి ప్రవహిస్తుంది.

జఠరికలు రక్తం తో నిండగానే సంకోచిస్తాయి.

అదే సమయం లో కర్ణికలు మాములు స్థితికి చేరుకుంటాయి.

జఠరికల సంకోచం వలన రక్తం దైహికచాపంలోనికి ,పుపుస ధమనిలోనికి  , దానిలో ఉన్న కావాటాలు తెరుచుకొని ప్రవహిస్తుంది.

అదే సమయంలో కర్ణికలు ,జఠరికల మధ్య ఉన్న కావాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుపోతాయి . కావటాలు మూసుకోవడం వలన ఫస్ట్ లబ్ అనే సౌండ్ మనకి పెద్దగా వినిపిస్తుంది.

జఠరికలు మామూలు స్థితికి చేరుకునే సమయం లో , జఠరికలోని పీడనం తగ్గిపోతూ ఉంటుంది . దీనివలన రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం తిరిగి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తుంది. 

రక్త నాళాలలోని కావాటాలు మూసుకుపోయి రక్తం వెనుకకు జఠరికలోనికి రావడాన్ని ఆపేస్తాయి.

ఈ  కావాటాలు మూసుకొన్నప్పుడు సెకండ్ ‘డబ్’  అనే సౌండ్ మనకి ‘చిన్నగా’ వినిపిస్తోంది.

ఇదే సమయానికి కర్ణికలు రక్తం తో నిండి మళ్ళి సంకోచానికి సిద్ధం అవుతాయి.

హృదయ స్పందనలో క్రమంగా జరిగే ఈ  ప్రక్రియలన్నింటిని కలిపి హార్దిక వలయం CARDIAC CYCLE అని అంటారు.

హార్దిక వలయం లో గుండె కండరాలు చాల చురుకుగా పాల్గొంటాయి. 

సంకోచక్రియ SYSTOLE ,విశ్రాంతి తీసుకొనే మామూలుపూర్వస్థితులు DIASTOLE ఒకదాని వెంట ఒకటి జరుగుతు ఉంటాయి.

ఈ  మొత్తం విధానం  సుమారుగా 0. 8 సెకన్లలో పూర్తవుతుంది . కర్ణికల సంకోచానికి పెట్టె సమయం 0. 11-0. 4 సెకన్లు కాగా జఠరికల సంకోచానికి 0. 27- 35సెకన్ల సమయం పడుతుంది.

ఈ  విధంగా రక్తం రక్తనాళాలలోనికి ఎప్పుడు వాటికీ నియమించిన కాలవ్యవధులలోనే ప్రవహిస్తూ ఉంటుంది.

అయితే కణజాలాలకు ప్రవహించే రక్తం నిరంతరంగా కాకుండా , ఆగుతూ ఆగుతూ అలలు అలలుగా ప్రవహిస్తూ ఉంటుంది. 

దాని వల్లనే మన మణికట్టు వద్ద మన వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్న ధమనిలో రక్తం ప్రవహించేట్టప్పుడు దాని ఒత్తిడి మనకి తెలుస్తుంది . దీనినే మనం నాడీ  కొట్టుకోవడం PULSE అని అంటాం. 

మన నాడీ  స్పందన రేటు , హృదయస్పందన రేటుకు సమానంగా ఉంటుంది.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.  

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top