AP 10th Class Biology Important Points 1st Chapter Telugu

WhatsApp Channel:
Telegram Channel:
  1. స్వయంపోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలు తయారుచేసుకుంటాయి . 
  1. వాన్ నిల్ అనే శాస్త్ర వేత్త పర్పుల్బాక్టీరియాలు పై పరిశోధనచేస్తూ కిరణ జన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు . 
  1. మొక్కలు మొదటగా సరళమైన కార్బో హైడ్రేట్స్ ను తయారుచేసుకుంటాయి . తరువాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైన పిండి పదార్థాలను మరియు సెల్యులోజ్ ను సంశ్లేషిస్తాయి . ఇవే కాకుండా మొక్కలు ప్రోటీన్లు , లిపిడ్లు మొదలైన పదార్థాలను కూడా తయారుచేసుకో గలుగుతాయి . 
  1. కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యక పదార్థాలుగా కాంతి , నీరు , కార్బన్డయాక్త్సెడ్, పత్రహరితములను పేర్కొనవచ్చు . 
  1. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసఫ్ ప్రీస్ట్ 1770 వ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది. 
  1.  1774వ సంవత్సరంలో జోసఫ్ ప్రిస్ట్లే ఆక్సిజన్ కనుగొన్న విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చుకోడి. 1775వ సంవత్సరంలో లెవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. 
  1. 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు  Kavansho అనే ఇద్దరు శాస్త్రవేత్త లు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరుచేసారు ఆ కషాయానికి పత్రహరితం అని నామకరణం చేసారు . క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్ధం . 
  1. 1883వ సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉండదని గమనించాడు. క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ కణాంగాలనే హరితరేణువులు అని అంటారు. మొక్కలలో పత్రరంద్రాలలోని రక్షక కణాలలో మరియు సంధాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్ లు అధిక సంఖ్యలో ఉంటాయి. 
  1. క్లోరోప్లాస్ట్ లు త్వచంతో కూడిన నిర్మాణాలు . ఇందులో రెండు త్వచాలు ఉంటాయి.  లోపల ఉన్న దొంతరలవంటి నిర్మాణాలను థైల్కోయిడ్ అంటారు. ఈ థైల్కోయిడ్ దొంతరలను గ్రానా అంటారు. ఈ  ప్రదేశంలో కాంతిశక్తి గ్రహించబడుతుంది . దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీనిని స్ట్రోమా అంటారు.
  1. హరితరేణువులో కాంతిని శోషించే పదార్దాలను కిరణజన్యసంయోగక్రియ వర్ణకాలు అంటారు.
  1. పత్రహరితం రక్తం లోని హీమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ ను పోలి ఉంటుంది. అయితే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటె పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది.
  2. కిరణజన్యసంయోగ క్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి 

1.కాంతి చర్య 

2. నిష్కాంతి చర్య 

  1. కొన్ని ఈస్టులు ,కుక్కగొడుగులు , రొట్టె బూజులు వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు. 
  2. ఏకకణ జీవి అయిన పారమీషియంకి కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది. 
  3. మానవులోని ఆహారనాళం పొడవైన గొట్టంవంటి నిర్మాణం. ఇది నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. 
  4. మనం అనేక రకాల ఆహారపదార్దాలు తిన్నప్పటికీ అవన్నీ ఒకే జీర్ణనాళం ద్వారా పంపబడతాయి. మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు. 
  5. ఎంజైముల సహాయంతో సంక్లిష్ట పదార్దాలు సరళ పదర్దాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. 
  6. మెత్తటి ఆహారం లాలాజలంతో కలిసిన తరువాత ఆహారవాహికలో పంపబడుతుంది. ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాన్ని గమనిస్తాం . దీనినే పెరిస్టాలిక్ చలనం అంటారు. 
  7. ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోకి మారుతుంది. దీనినే కైమ్ అని అంటారు. 
  8. కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్దాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుతుంది. ఈ  విధానాన్ని ఎమ్మెల్సీకరణం అని అంటారు.  
WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top