Equilateral Triangle in Telugu – సమ బాహు త్రిభుజం

ఈ రోజు ఆర్టికల్ లో మనం Equilateral Triangle కోసం డిస్కస్ చేసుకోవచ్చు. 

Equilateral Triangle ను తెలుగులో సమ బాహు త్రిభుజం అని అంటారు. 

ఒక త్రిభుజం లో మూడు భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని Equilateral Triangle అని అంటారు. 

సమ బాహు త్రిభుజం మూడు కోణములు కూడా సమానంగా ఉంటాయి. 

భుజాల పొడవును బట్టి త్రిభుజములు మూడు రకములు 

Equilateral triangle , isosceles triangle and scalene triangle. 

Equilateral triangle లో మూడు భుజాలు సమానంగా ఉంటాయి. 

Isosceles triangle లో రెండు భుజాలు సమానంగా ఉంటాయి. 

Scalene triangle లో మూడు భుజాల పొడవులు భిన్నంగా ఉంటాయి. 

Equilateral triangle ను Equiangular triangle అని కూడా అంటారు. 

ABC అను equilateral triangle లో AB = BC = CA , angle A = angle B = angle C 

a అనునది equilateral భుజం పొడవు అయిన 

Equilateral triangle యొక్క perimeter P = 3a 

Equilateral triangle యొక్క area 

A = [(square root of 3)/4]*a^2

Equilateral triangle లో కోణాల మొత్తం 180 డిగ్రీలు. 

Problems on Equilateral Triangle 

Q : ఒక సమబాహు త్రిభుజం లో ఒక భుజం పొడవు 5m అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత ఎంత?

Ans : సమ బాహు త్రిభుజ Perimeter P = 3a = 3*5 = 15m 

Q : ఒక సమ బాహు త్రిభుజంలో ఒకో కోణం ఎంత ఉంటుంది?

Ans : సమ బాహు త్రిభుజం లో మూడు కోణాలు సమానంగా ఉంటాయి. 

త్రిభుజం లో కోణాల మొత్తం = 180 డిగ్రీలు 

త్రిభుజం లో మూడు కోణాలు ఉంటాయి. 

సమ బాహు త్రిభుజం లో ఒకో కోణం = 180/3 = 60 degrees 

 Q : ఒక సమ బాహు త్రిభుజం లో ఒక భుజం 10m అయినా మిగతా రెండు భుజాల పొడవులు ఎంత?

Ans : సమ బాహు త్రిభుజం లో మూడు భుజాలు సమానంగా ఉంటాయి కనుక మిగతా రెండు భుజాల పొడవులు = 10m 

Scroll to Top