AP SSC 10th Class Physical Science Bits 5th Chapter Telugu

కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడాన్ని _______________అని అంటారు. 

ANS కటక సర్థుబాటు 

ఒక వ్యక్తి గరిష్ట దూరబిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేక పోయే దృష్టి దోషాన్ని ____________అని అంటారు. 

ANS  హ్రస్వదృష్టి 

ఒక వ్యక్తి కనిష్ట దూరబిందువుకు లోపల ఉన్న వస్తువును చూడలేకపోయే ద్రుష్టి దోషాన్ని ___________అని అంటారు. 

ANS దూర ద్రుష్టి 

వయస్సురీత్యా కంటికటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయే ద్రుష్టి దోషాన్ని _____________అని అంటారు. 

ANS చత్వారం 

నాబ్యాంతరం యొక్క విలువను __________________అని అంటారు. 

ANS  కటక సామర్థ్యం 

తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని__________________అని అంటారు. 

ANS కాంతి విక్షేపణం 

ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగిఅన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని  _____________అని అంటారు.  

ANS కాంతి పరిక్షేపణం 

కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని _______________అని అంటారు. 

ANS కాంతి తీవ్రత 

ఉద్గరమైనా కాంతిని _______________అని అంటారు. 

ANS పరిక్షేపణ కాంతి 

ఉద్గరం చేసిన పరమాణువు లేదా అణువును ___________________అని అంటారు. 

ANS పరిక్షేపణ కేంద్రం 

నిర్దిష్ట దిశలో , అంటే కాంతి తీవ్రతను పరిశీలించే దిశలో వచ్చే పరిక్షేపణ కాంతికి ,పతన కాంతికి మధ్యగల కోణాన్ని ______________అని అంటారు. 

ANS  పరిక్షేపణ కోణం 

కాంతి జనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను ___________________అని అంటారు. 

ANS పౌనఃపున్యం

కాంతి పౌనఃపున్యం అనేది _____________యొక్క లక్షణం . 

ANS కాంతి జనకం 

పతనకిరణం లంబంతో చేసే కోణాన్ని _______________అని అంటారు. 

ANS పతన కోణం 

N బిందువు గుండా బయటకి వచ్చే కిరణాన్ని ____________అని అంటారు. 

ANS  బహిర్గత కిరణం 

లంబానికి ,బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని _______________అని అంటారు. 

ANS బహిర్గత కోణం 

PQ , PR తలల మధ్య కోణాన్ని __________________లేదా ________________అని అంటారు. 

ANS పట్టక కోణం , పట్టక వక్రీభవన కోణం 

పతన కిరణానికి , బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని ____________________అని అంటారు. 

ANS విచలన కోణం 

ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతాలలతో పరిసర యానకం నుండి వేరు చెయ్యబడి ఉన్న పారదర్శక యానకాన్ని _________________అని అంటారు. 

ANS  పట్టకం   

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top