Whole Numbers in Telugu – పుర్ణాంకాలు

ఈ రోజు ఆర్టికల్ లో మనం Whole Numbers కోసం డిస్కస్ చేసుకోవచ్చు. 

Whole Numbers ని తెలుగులో పుర్ణాంకాలు అని అంటారు. 

వీటిని W చే సూచిస్తారు. 

సున్నా మరియు Natural Numbers ల సమితిని Whole Numbers అని అంటారు. 

W = {0, 1, 2, 3, 4, 5, … }

సహజ సంఖ్యల సమితి Whole Numbers సమితికి ఉపసమితి. 

మిక్కిలి చిన్న పూర్ణంకం 0. 

మిక్కిలి పెద్ద పూర్ణంకం ఏమిటో చెప్పలేము. ఇది అనంతం. 

సహజ సంఖ్యలు అన్ని Whole Numbers అవుతాయి. 0 తప్ప మిగిలిన Whole Numbers అన్ని సహజ సంఖ్యలు అవుతాయి. 

సున్నా తో కలిపి మొత్తం natural numbers whole numbers అవుతాయి. 

Whole numbers అన్ని real numbers అవుతాయి. Real numbers అన్ని Whole Numbers అవ్వవు. 

మొత్తం counting numbers అన్ని whole numbers అవుతాయి. 

Properties of Whole Numbers in Telugu

Whole Numbers యొక్క properties డిస్కస్ చేసుకుందాం. 

Closure Property

Whole Numbers are closed under addition and multiplication. Whole Numbers are not closed under subtraction and division.

a, b  లు Whole Numbers అయితే a+b , a*b కూడా Whole Numbers అవుతాయి.

a, b  లు Whole Numbers అయితే a-b , a/b అన్ని Whole Numbers అవ్వవు. 

Commutative Property of Addition

a , b లు Whole numbers  అయిన a+b=b+a 

Commutative Property of Multiplication

a , b లు Whole numbers  అయిన a*b=b*a 

Additive identity

a అనునది whole number అయిన a+0=0+a=a అవుతుంది. కావున 0 ను Whole Numbers యొక్క additive identity ani అంటారు.

0+12=12+0=12

Multiplicative Identity

a అనునది whole number అయిన a*1=1*a=a అవుతుంది. కావున 1 ను Whole Numbers యొక్క multiplicative identity ani అంటారు.

12*1=1*12=12

Associative Property

a , b , c లు whole numbers అయిన

a+(b+c) = (a+b)+c

a*(b*c) = (a*b)*c

whole numbers are associative under addition and multiplication.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.

Scroll to Top