ఈ రోజు ఆర్టికల్ లో Prime Numbers కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Prime Numbers ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అని అంటారు.
ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు.
ప్రధాన సంఖ్యలకు రెండు కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అవి ఒకటి మరియు అదే సంఖ్య.
Prime Numbers : 2, 3, 5, 7, 11, 13, ..
మిక్కిలి చిన్న ప్రధాన సంఖ్య 2.
మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య ఎంతో చెప్పలేము. ఇది అనంతం.
2 ను సరి ప్రధాన సంఖ్య అని అంటారు.
1 ప్రధాన సంఖ్య కాదు.
0 ప్రధాన సంఖ్య కాదు.
ప్రధాన సంఖ్య కానీ సంఖ్యను సంయుక్త సంఖ్య అని అంటారు.
ప్రధాన సంఖ్యలను అవిభాజ్య సంఖ్యలు అని కూడా అంటారు.
మొదటి 25 ప్రధాన సంఖ్యలు: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97.
రెండు వరుస ప్రధాన సంఖ్య ల భేదం 2 అయిన ఆ సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు.
41, 43 కవల ప్రధాన సంఖ్యలకు ఉదాహరణలు.
యూక్లిడ్ తన పుస్తకంలో మరొక విషయాన్ని Proove చేశారు.
ఏ సంఖ్యనైనా సరే కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా, ఒక unique పద్ధతిలో – వరుస క్రమంలో మార్పులని మినహాయించి – రాయవచ్చని ఆయన రుజువు చేశారు. దీనినే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం (The Fundamental Theorem of Arithmetic) అంటారు.
For Example
2 = 2 x 1
8 = 2 x 2 x 2
21 = 3 x 7
Some Questions and Answers on Prime Numbers in Telugu
Q: మొదటి అయిదు ప్రధాన సంఖ్యలను వ్రాయండి.
Ans : మొదటి అయిదు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11
Q: మొదటి అయిదు బేసి ప్రధాన సంఖ్యలను వ్రాయండి
Ans : మొదటి అయిదు బేసి ప్రధాన సంఖ్యలు 3, 5, 7, 11, 13
Q: మొదటి అయిదు సరి ప్రధాన సంఖ్యలను వ్రాయండి.
Ans : ప్రధాన సంఖ్యలలో ఒకే ఒక సరి సంఖ్య ఉంటుంది అది రెండు.
2 ను సరి ప్రధాన సంఖ్య అంటారు.
Q: 1 ప్రధాన సంఖ్య అవుతుందా?
Ans : ఒకటి ప్రధాన సంఖ్య కాదు. ఒకటికి ఒకటే కారణాంకం. ప్రధాన సంఖ్యకు రెండు కారణాంకాలు ఒకటి మరియు అదే సంఖ్య ఉంటాయి.
Q:మిక్కిలి చిన్న ప్రధాన సంఖ్య ఏది? మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య ఏది?
Ans : మిక్కిలి చిన్న ప్రధాన సంఖ్య 2.
మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య ఏంటో చెప్పలేము. ఇది అనంతం.
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.