ఈ రోజు ఆర్టికల్ లో Properties of Triangles కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Triangle ని తెలుగులో త్రిభుజం అని అంటారు.
ఒక Straight Line మీద లేని మూడు బిందువులను సరళ రేఖా ఖండాలతో కలుపగా వచ్చే పటాన్ని త్రిభుజం లేదా త్రికోణం అని అంటారు.
త్రిభుజం ఒక సంవృత పటం.
ఆ బిందువులను శీర్షములు అని అంటారు.
ఆ రేఖా ఖండములను భుజములు లేదా బాహువులు అని అంటారు.
Properties of Triangles in Telugu
త్రిభుజం లో మూడు భుజాలు ఉంటాయి.
త్రిభుజం లో మూడు కోణములు ఉంటాయి.
త్రిభుజం ఒక సంవృత పటం.
త్రిభుజంలో మూడు కోణముల మొత్తం 180 degrees.
త్రిభుజం లో మూడు భుజములను చిన్న letters తో సూచిస్తారు.
త్రిభుజం లో మూడు శీర్షములను Capital letters తో సూచిస్తారు.
త్రిభుజం లో రెండు భుజముల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది.
త్రిభుజం లో రెండు భుజముల భేదం మూడవ భుజం కంటే తక్కువ ఉంటుంది.
ఒక త్రిభుజం లో ఓకే శీర్షిక గల interior angle మరియు exterior angle మొత్తం 180 డిగ్రీలు.
ఒక త్రిభుజం లో అతి చిన్న భుజం ఆ త్రిభుజం లో అతి చిన్న కోణానికి opposite గా ఉంటుంది.
ఒక త్రిభుజం లో అతి పెద్ద భుజం ఆ త్రిభుజం లో అతి పెద్ద కోణానికి opposite గా ఉంటుంది.
త్రిభుజం యొక్క Area = (½)*Base*Height
త్రిభుజం యొక్క perimeter = AB+BC+CA
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.
Amazon Affiliate Disclaimer: You can find amazon affiliate links on this page. When you purchase through these links, I will get some commission at no extra cost to you.