Photosynthesis Telugu – కిరణ జన్య సంయోగక్రియ

ఈ రోజు మన ఆర్టికల్ లో Photosynthesis గురించి తెలుసుకుందాం . 

Photosynthesis ని తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు . 

కిరణ జన్య సంయోగక్రియ జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణ దాన్ని కలిగి ఉంటాయి . 

దీనినే పత్రహరితం క్లోరోఫీల్ అని అంటారు .

ఇవి కాంతి శక్తిని వినియోగించి సరళ అకర్బన పదార్ధాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చుతాయి . ఈ ప్రక్రియనే కిరణ  జన్య సంయోగ క్రియ అని అంటారు . 

ఇది చాల సంక్లిష్టమైన విధానం . ఇందులో అనేక రకాల చర్యలు క్రమపద్ధతిలో జరుగుతుంది . దీనితో పాటుగా అనేక సమ్మేళనాల [ intermediary compounds ]కూడా ఏర్పడుతు ఉంటాయి . 

గత 200 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను సరళమైన సమీకరణ రూపంలో చూపడానికి చాల కృషి చేస్తున్నారు . 

1931వ సంవత్సరంలో సి . బి . వాన్ నీల్ [డచ్ ]అనే ఒక శాస్త్రవేత్త రూపొందిచిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికి కూడా మనం వినియోగిస్తున్నాం . 

కిరణజన్య సంయోగక్రియ లో కార్భోహైడ్రేట్ ఏర్పడటం దీనితో పాటుగా ఒక అణువు నీరు అలాగే ఒక అణువు ఆక్సీజన్ కూడా విడుదల చేస్తాయని ఆ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు . 

కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ చాల సంక్లిష్టమైనదైనప్పటికీ ప్రస్తుతం మనం అందరం సులభంగా ఉన్న ఈ సమీకరణాన్నే ఉపయోగిస్తున్నాం . 

గ్లూకోజ్ [C6H12O6]ఏర్పడే విధంగా చూపించాలనుకుంటే సమీకరణం ఏ రకంగా ఉండాలి . దీని కోసం సమీకరణాన్ని సమానం చేసి తిరిగి రాయండి .  

వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ అనే బ్యాక్టీరియాల పై పరిశోధనలు చేస్తూ కిరణ జన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి తెలుసుకున్నాడు . 

అయితే బాక్టీరియాలు H2O కు బదులుగా H2S ను మొదలు పెట్టె పదార్ధం గా వినియోగిస్తాయి . 

ఈ  బాక్టీరియాలు జరిపే కిరానా జన్య సంయోగ క్రియలలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ ఉండడాన్ని ఆ శాస్త్రవేత్త గుర్తించాడు .

రాబర్ట్ హిల్ ఈ  చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించాడు . 

మొక్కలు మొట్ట మొదటిగా సరళమైన కార్బోహైడ్రేట్లను ఏర్పరచుకుంటాయి . 

తర్వాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైన పిండి పదార్ధాలను అలాగే సెల్యూలోజ్ ను సంశ్లేషిస్తాయి . 

అవే  కాకుండా మొక్కలు పోషకాలు ,లిపిడ్లు  మొదలైన పదార్ధాలను కూడా    తయారుచేసుకుంటాయి . 

కానీ జంతువులు కార్భోహైడ్రేట్లను వాటికి అవి సొంతంగా తయారుచేసుకోలేవు . 

అందుకే జంతువులు కార్భోహైడ్రేట్ల కోసం మొక్కల పై  ఆధారపడతాయి . 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి. 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top