Lymphatic System in Telugu – శోషరస వ్యవస్థ

ఈ రోజు మన ఆర్టికల్ లో శోషరస వ్యవస్థ గురించి తెలుసుకుందాం.

రక్తనాళలలో రక్తం కణజాలాల ద్వారా ప్రవహించే సమయంలో ,రక్తనాళ నుండి కొన్ని ఘనపదార్దాలు,కొంత ద్రవం రక్తనాళికా కూడళ్ళ వద్ద నుండి బయటకు పంపబడతాయి . 

వీటన్నింటినీ సేకరించి రక్త ప్రసరణ వ్యవస్థలోకి తీసుకురావలిసిన అవసరం ఉంది . 

రాత్రంతా బస్సులో కదలకుండా కూర్చని ప్రయాణం చేసిన తర్వాత మీ పాదాలకు ఏమవుతుందో ఎప్పుడైనా గుత్తిచారా పాదరక్షలు కొంచం బిగుతుగా అయినట్లు అనిపించిందా పెద్దవారిలో ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది .

కాళ్ళు కొంతవాచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది . 

దీనినే ఎడిమా అంటారు. 

హృదయస్పందన వలన  రక్తం నాళాలలో ప్రవహిస్తుందని మనకు తెలుసు కదా . గుండె నుండి ప్రవహించే రక్తం ,రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరకు రక్త కేశనాళికలను చేరుతుంది . 

పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశనాళికల ద్వారా కణజాలలోనికి వస్తుంది. 

కణజాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగానికి కణజాల ద్రవం TISSUE FLUID అంటారు. 

కణజాలలోని ఉన్న కణజాల ద్రవం మళ్ళి రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరాలి. 

కణజాల ద్రవం లోని కొంత భాగం సిరికా అనే అతి చిన్న సిరల VENUELS లోనికి వచ్చి అక్కడ నుండి సిరల ద్వారా గుండెను చేరుతుంది. 

కణజాలాలలో మిగిలిపోయిన ఈ  కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరడానికి మరొక్క సమాంతర వ్యవస్థ ఏర్పడుతుంది . 

దానినే శోషరస వ్యవస్థ అని అంటారు. లాటిన్ భాషలో లింఫ్ అంటే నీరు అని అర్ధం. 

కణజాలాలకు రక్తానికి మధ్య ప్రధానమైన సంధాన పదార్థంగా శోషరసం పని చేస్తుంది. 

రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం,కణాల నుండి వృథా పదార్దాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం వంటి విధులను శోషరసం చేస్తుంది. 

సిరా వ్యవస్థకు సమాంతరమైనా ఈ  వ్యవస్థ కణజాలాల నుండి సేకరించి కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోనికి చేర్చడానికి తోడ్పడుతుంది. 

రక్తం ఘన మరియు ద్రవ పదార్దాల మిశ్రమం . ఘన పదార్దాలు లేని రక్తమే శోషరసం 

కణజాలాలలో ఉన్న శోషరసమే కణజాల ద్రవం . రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సీరం SERUM అని అంటారు. 

అస్తికండరాల సంకోచం వలన సిరల పైన , శోషరసనాళాలపైనా ఒత్తిడి పెరిగి రక్తం ,శోషరసం గుండె వైపునకు నెట్టబడతాయి. 

సిరలలోను శోషరసనాలలోను కావటాలు ఉండటం. దాని వలన రక్తం వెనక్కి రాకుండా నిరోధించబడుతుంది. 

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top