ఈ రోజు ఆర్టికల్ లో even numbers కోసం డిస్కస్ చేసుకోవచ్ఛు.
Even numbers ని తెలుగులో సరి సంఖ్యలు అని అంటారు.
ఏదయినా నెంబర్ ని 2 తో భాగించినప్పుడు శేషం జీరో వస్తే అటువంటి సంఖ్యలను Even Numbers అని అంటారు.
0, 2, 4, 6, 8, 10 ….
సరి సంఖ్యలు రుణాత్మకంగా ఉండవచ్చు. Ex : -24, -46 etc
సున్నా అనునది సరి సంఖ్య.
మిక్కిలి చిన్న సరి సంఖ్య సున్నా
మిక్కిలి పెద్ద సరి సంఖ్య ఏమిటో చెప్పలేము . ఇది అనంతం
k ఒక పూర్ణ సంఖ్య అయిన సరి సంఖ్య n = 2k రూపంలో ఉంటుంది
సరి సంఖ్యలను సమితి రూపంలో కింది విధంగా వ్రాస్తారు.
సరి సంఖ్యలు = {2k where k belongs to Z }
Properties of Even Numbers in Telugu
- రెండు సరి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అవుతుంది
- రెండు సరి సంఖ్యల భేదం సరి సంఖ్య అవుతుంది
- రెండు సరి సంఖ్యల లబ్దం సరి సంఖ్య అవుతుంది
- రెండు వరుస సరి సంఖ్యల భేదం రెండు
- ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య ల మొత్తం బేసి సంఖ్య అవుతుంది
- ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య ల భేదం బేసి సంఖ్య అవుతుంది
- ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య ల లబ్దం సరి సంఖ్య అవుతుంది
Some Problems on Even Numbers in Telugu
Q1: 235, 456 ల మొత్తం ఏ సంఖ్య అవుతుంది
235 అనునది బేసి సంఖ్య . 456 అనునది సరి సంఖ్య. బేసి సంఖ్య మరియు సరి సంఖ్య ల మొత్తం బేసి సంఖ్య అవుతుంది కాబట్టి 235, 456 ల మొత్తం బేసి సంఖ్య.
Q2: 806, 234 ల మొత్తం ఏ సంఖ్య అవుతుంది?
806, 234 రెండు కూడా సరి సంఖ్యలు. రెండు సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్య కనుక 806, 234 ల మొత్తం సరి సంఖ్య అవుతుంది
Q3:446, 234 ల భేదం ఏ సంఖ్య అవుతుంది
446, 234 రెండు కూడా సరి సంఖ్యలు. రెండు సరి సంఖ్యల భేదం సరి సంఖ్య కనుక 446, 234 ల భేదం సరి సంఖ్య అవుతుంది.
Q4: 123, 246, 34, 43, 92, 90 వీటిలో సరి సంఖ్యలు ఏవి?
246, 34, 92, 90 అనునవి పైన ఇచ్చిన వాటిలో సరి సంఖ్యలు
Q5: 234567, 9864 ల లబ్దం ఏ సంఖ్య అవుతుంది
ఇచ్చిన సంఖ్యలలో ఒక సరి సంఖ్య ఇంకోటి బేసి సంఖ్య. సరి సంఖ్య , బేసి సంఖ్య ల లబ్దం సరి సంఖ్య కాబట్టి 234567, 9864 ల లబ్దం సరి సంఖ్య అవుతుంది.
Conclusion
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను
మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.